అంబేడ్కర్ విగ్రహం ధ్వంసం..!

అంబేడ్కర్ విగ్రహం ధ్వంసం..!

MDK: నర్సాపూర్ మండలం ఎల్లాపూర్ గ్రామంలో అంబేడ్కర్ విగ్రహానికి అవమానం జరిగింది. గ్రామస్తుల వివరాలు.. గ్రామంలో ఉన్న విగ్రహాన్ని ఆదివారం రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేశారు. కరెంటు వైర్లు కట్ చేసి ఈ చర్యకు పాల్పడ్డారు. ధ్వంసానికి పాల్పడిన వ్యక్తులను పట్టుకుని కఠినంగా శిక్షించాలని మాల, మాదిగల సంఘాల నాయకులు డిమాండ్ చేశారు.