నెల్లికల్ ప్రాజెక్టు భూసేకరణపై కలెక్టర్ సమీక్ష

నెల్లికల్ ప్రాజెక్టు భూసేకరణపై కలెక్టర్ సమీక్ష

NLG: నెల్లికల్ లిఫ్ట్ ఇరిగేషన్ కింద భూసేకరణ పూర్తయినందున తదుపరి ప్రక్రియను వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి ఇరిగేషన్ అధికారులను ఆదేశించారు. శనివారం ఆమె మిర్యాలగూడ సబ్ కలెక్టర్ కార్యాలయంలో ఇరిగేషన్ ప్రాజెక్టు పనులపై మిర్యాలగూడ శాసనసభ్యులు బత్తుల లక్ష్మారెడ్డి, నాగార్జునసాగర్ శాసనసభ్యులు కుందూరు జయవీర్ రెడ్డిలతో కలిసి సమీక్ష నిర్వహించారు.