రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం హర్షణీయం: అజయ్ కుమార్

సూర్యాపేట: ధరణి సమస్యల పరిష్కారానికి రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం హర్షణీయమని కాంగ్రెస్ నాయకులు అజయ్ కుమార్ శనివారం తెలిపారు. ఎన్నో సంవత్సరాలుగా సీలింగ్ భూములను కొనుగోలు చేసిన రైతుల భూ సమస్యలను పరిష్కరించాలని పలు ఉద్యమాలు చేసినప్పటికీ ఫలితం లేదని నూతనంగా ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో భూ సమస్యలు పరిష్కరించడం సంతోషంగా ఉందన్నారు.