మహిళకు బాపట్ల ఎమ్మెల్యే చేయూత

BPT: 'మన వార్డు-మన ఎమ్మెల్యే' కార్యక్రమంలో భాగంగా బాపట్ల 5వ వార్డు రైలుపేటలో సోమవారం ఉదయం ఎమ్మెల్యే వేగేశన నరేంద్ర వర్మరాజు పర్యటించారు. ఈ సందర్భంగా ప్రజల సమస్యలను తెలుసుకుంటూ ముందుకు సాగారు. సమస్యలపై అధికారులతో మాట్లాడి అక్కడికక్కడే పరిష్కరించారు. అనంతరం ఓ మహిళ ఆర్థికంగా ఇబ్బందులు పడుతుందని తెలుసుకుని ఆమెకు ఆర్థిక సాయం అందజేశారు.