NIMSలో ప్రజా కళాకారుడు.. మెరుగైన వైద్యం పై మంత్రి ఆదేశం
HYD: రాష్ట్ర మంత్రి దామోదర రాజనర్సింహ ప్రజా కళాకారుడు జయరాజును ఇవాళ పరామర్శించారు. HYDలోని పంజాగుట్ట NIMS ఆసుపత్రిలో ఆయన చికిత్స పొందుతున్నారు. మంత్రి, ఆయన ఆరోగ్య పరిస్థితిని స్వయంగా అడిగి తెలుసుకున్నారు. మెరుగైన వైద్యం అందించాలని NIMS ఆసుపత్రి డైరెక్టర్ డాక్టర్ బీరప్పకు మంత్రి వెంటనే ఆదేశాలు జారీ చేసినట్లు తెలిపారు.