ప్రైవేటీకరణ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలి: అరకు ఎమ్మెల్యే

ప్రైవేటీకరణ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలి: అరకు ఎమ్మెల్యే

అల్లూరి: డుంబ్రిగుడ మండలం బిల్లాపుట్టు గ్రామంలో ఆదివారం అరకు ఎమ్మెల్యే రేగం మత్స్యలింగం పర్యటించారు. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా చేపట్టిన కోటి సంతకాల సేకరణ కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొన్నారు. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ వల్ల పేద విద్యార్థులకు తీవ్రంగా నష్టం జరుగుతుందన్నారు. కూటమి ప్రభుత్వం ప్రైవేటీకరణ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని కోరారు.