ఆగిన కారును ఢీ కొట్టిన ఆర్టీసీ బస్సు
ప్రకాశం: మార్కాపురం మండలం కొట్టాలపల్లి వద్ద ఓ ఆర్టీసీ బస్సు, ఆగి ఉన్న కారును వెనుక నుంచి ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న ఇద్దరికి స్వల్ప గాయాలయ్యాయి. ఢీకొన్న ధాటికి కారు ముళ్ళ పొదలలోకి దూసుకుపోయింది. గాయపడిన వారిని స్థానిక ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై స్థానిక పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.