వీధుల్లో కోతుల బీభత్సం
NLG: నిడమనూరు మండల వ్యాప్తంగా కోతులు బీభత్సం సృష్టిస్తున్నాయి. మండల కేంద్రానికి చెందిన పార శ్రీనివాస్‌పై కోతులు దాడి చేసి గాయపరిచాయి. అంతేకాకుండా చిన్నాపెద్దా తేడా లేకుండా గుంపులు గుంపులుగా మీద పడి గాయపరుస్తున్నాయి. తిను బండారాల కోసం దుకాణాలు, పండ్లబండ్లు, ఇండ్ల కప్పులపై ఉండి భయబ్రాంతులకు గురి చేస్తున్నాయి. ఇకనైనా కోతుల బెడద నుంచి కాపాడాలని ప్రజలు కోరుచున్నారు.