అకాల వర్షంతో.. అపార నష్టం
ATP: కూడేరు మండల పరిధిలో మంగళవారం వీచిన ఈదురు గాలులకు జల్లిపల్లిలో రైతు దేవేంద్రకు చెందిన మూడు ఎకరాల్లోని అరటి చెట్లు నేలకొరిగాయి. ముద్దలాపురం, కొర్రకోడు, మరుట్ల, ఇప్పేరు, గౌటుకూరు, కూడేరుతో పాటు మరికొన్ని గ్రామాల్లో మొక్కజొన్న, అరటి పంట నేలకొరిగింది. సంబంధిత అధికారులు బుధవారం నష్టపోయిన పంటను అంచనా వేశారు.