కమ్యూనిటీ హెల్త్ సెంటర్ సిబ్బందికి హెపటైటిస్–బి వ్యాక్సిన్

MDK: రామాయంపేట మండల కేంద్రంలోని కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌లో శుక్రవారం వైద్య సిబ్బందికి హెపటైటిస్–బి వ్యాక్సిన్ పంపిణీ చేశారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా వైద్య ఆరోగ్య శాఖలో విధులు నిర్వహిస్తున్న సిబ్బందికి హెపటైటిస్–బి వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు.