డీఐజీ డా.షిముషికి ఉత్కృష్ట సేవా పతకం
ATP: అనంతపురం రేంజ్ డీఐజీ డా.షిముషికి కేంద్ర హోంశాఖ ఉత్కృష్ట సేవా పతకం ప్రకటించింది. విధుల్లో ఆమె చూపిన ప్రతిభ, అంకితభావానికి గుర్తింపుగా ఈ గౌరవం దక్కింది. గురువారం CM చంద్రబాబు నాయుడు చేతుల నుంచి ఈ ప్రతిష్టాత్మక పతకాన్ని అందుకోనున్నారు. శాంతిభద్రతల పరిరక్షణలో కీలక పాత్ర పోషించినందుకు ఈ అవార్డు లభించడం పట్ల పోలీస్ వర్గాల్లో హర్షం వ్యక్తమవుతోంది.