నేత్రదానం చేసిన వృద్ధురాలు

నేత్రదానం చేసిన వృద్ధురాలు

HYD: చందానగర్ డివిజన్ పరిధిలోని రాజేందర్ రెడ్డి కాలనీ అధ్యక్షుడు కుంట రఘుపతి రెడ్డి తల్లి రాజమణి సోమవారం మృతి చెందారు. అవయవాలు దానం చేయాలన్న ఆమె కోరిక మేరకు నేత్రదాన సంచాలకర్త అల్లం పాండు రంగారవు, పులిపాటి సుధాకర్‌ను సంప్రదించి నగరంలోని ఎల్వీ ప్రసాద్ కంటి ఆసుపత్రికి నేత్రాలను దానం చేశారు. ఈ సందర్భంగా వారు రఘుపతి రెడ్డి కుటుంబ సభ్యులను అభినందించారు.