యలమంచిలి మండలంలో పర్యటించిన జేసీ

W.G: గోదావరి వరద ఉధృతి అంతకంతకు పెరుగుతున్న నేపథ్యంలో లంకవాసుల యోగ క్షేమాలను తెలుసుకునేందుకు జిల్లా జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి గురువారం యలమంచిలి మండలం కనకాయ లంకకు పడవపై చేరుకున్నారు. గ్రామంలోని రోడ్లపైకి నీరు రావడం పరిశీలించారు. మార్గమధ్యంలో అంగన్వాడీ ఫ్రీ స్కూల్లో ఏర్పాటు చేసిన మెడికల్ క్యాంపును పరిశీలించి పలు సూచనలు జారీ చేశారు.