రైల్వే అండర్ పాస్ బ్రిడ్జిని పరిశీలించిన ఎమ్మెల్యే

MBNR: గత రాత్రి కురిసిన భారీ వర్షాలకు అప్పన్నపల్లి రైల్వే అండర్ పాస్ బ్రిడ్జి ప్రహరీ గోడ కూలిపోవడంతో ఎమ్మెల్యే శ్రీనివాస్ రెడ్డి గురువారం ప్రహరీ గోడను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రహరీ గోడ కూలిపోవడంపై రైల్వే అధికారులతో మాట్లాడనని, అధికారులు త్వరితగతిన పనులు ప్రారంభించి పునర్నిర్మిస్తారని తెలిపినట్లు వెల్లడించారు.