అక్రమంగా నల్లమట్టి తరలిస్తున్న టిప్పర్‌ సీజ్

అక్రమంగా నల్లమట్టి తరలిస్తున్న టిప్పర్‌ సీజ్

NRPT: అనుమతి లేకుండా అక్రమంగా నల్లమట్టిని తరలిస్తున్న టిప్పర్‌ను మాగనూర్ పోలీసులు సోమవారం సీజ్ చేశారు. ఆదివారం రాత్రి కానిస్టేబుళ్లు పెట్రోలింగ్ చేస్తుండగా, నల్లగట్టు మారెమ్మ గుడి సమీపంలో రాయచూర్ నుంచి వస్తున్న టిప్పర్‌ను తనిఖీ చేశారు. ఎలాంటి అనుమతి పత్రాలు లేకుండా తరలిస్తున్న నల్లమట్టిని గుర్తించారు. దీంతో వాహనాన్ని సీజ్ చేసి, డ్రైవర్‌పై కేసు నమోదు చేశారు.