క్రైస్తవ ఉజ్జీవ సభల పోస్టర్ ఆవిష్కరణ
HYD: కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీగణేష్ తన కార్యాలయంలో క్రైస్తవ ఉజ్జీవ సభల పోస్టర్‌ను ఆవిష్కరించారు. ఈ సభలు ఈ నెల 24 నుంచి 26వ తేదీ వరకు దోబీఘాట్‌లో 3 రోజులపాటు జరగనున్నాయి. సభల విజయవంతానికి తనవంతు సహకారాన్ని అందిస్తానని ఎమ్మెల్యే ఈసందర్భంగా ఆహ్వానించిన పాస్టర్లకు హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో పాస్టర్లు జూలియస్, అరుణ్, ఆనంద్, మహేష్ తదితరులు పాల్గొన్నారు.