నేడు 'స్త్రీ శక్తి పథకాన్ని' ప్రారంభించనున్న ఎమ్మెల్యే

ప్రకాశం: కనిగిరి ఆర్టీసీ డిపో నందు ఎమ్మెల్యే డాక్టర్ ముక్కు ఉగ్ర నరసింహ రెడ్డి సాయంత్రం 4 గంటలకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన స్త్రీ శక్తి పథకాన్ని ప్రారంభిస్తున్నట్లు డిపో మేనేజర్ షయానా బేగం తెలిపారు. ఆమె మాట్లాడుతూ..స్త్రీ శక్తి పథకం కింద రాష్ట్రంలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణాన్ని కల్పిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమానికి మహిళలందరూ హాజరు కావాలని కోరారు.