తిప్పపాలెంలో నూతన గృహం ప్రారంభించిన ఎమ్మెల్యే

తిప్పపాలెంలో నూతన గృహం ప్రారంభించిన ఎమ్మెల్యే

కృష్ణా: అవనిగడ్డ గ్రామ పంచాయతీ శివారు తిప్పపాలెం లే-ఔటులో నూతన పీఎంఏవై 1.0 గృహాన్ని ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ ప్రారంభించారు. పీఎంఏవై 1.0 పథకం ద్వారా రూ.1.80 లక్షలతో యండలూరి భవానీ ఈ గృహాన్ని నిర్మించుకున్నారు. నియోజకవర్గ ప్రత్యేక అధికారి పెనుమూడి సాయిబాబు, ఎంపీపీ సుమతి, ఎంపీడీవో మరియాదేవి, ఎంపీటీసీ భాను పాల్గొన్నారు.