నల్లాకు అక్రమంగా బిగించిన మోటార్లు స్వాధీనం

నల్లాకు అక్రమంగా బిగించిన మోటార్లు స్వాధీనం

HYD: ఎస్ఆర్ నగర్ పరిధిలోని ఎస్ఆర్టీ కాలనీలో నల్లాకు మోటర్లు బిగిస్తున్నారని స్థానికులు జలమండలి విజిలెన్స్ అధికారులకు సమాచారం అందించారు. స్పందించిన అధికారులు నీటి సరఫరా సమయంలో పర్యటించి పైపులైనుకు అక్రమంగా బిగించిన 7 మోటర్లను స్వాధీనం చేసుకున్నారు. వినియోగదారులు తమ నల్లాలకు మోటార్లు బిగించి పట్టుబడితే చర్యలు తీసుకోవడంతో పాటు మోటార్లు సీజ్ చేస్తామన్నారు.