అధికారులకు కలెక్టర్ పలు సూచనలు
ప్రకాశం: ఓటర్ల జాబితా రూపకల్పనే లక్ష్యంగా ఇప్పటి నుంచే దృష్టిసారించాలని కలెక్టర్ రాజాబాబు సూచించారు. ఈ దిశగా ప్రణాళికాబద్ధంగా పనిచేయాలని ఈఆర్‌వోలను ఆదేశించారు. స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ నిర్వహణపై రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వివేక్ అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్‌కు ఒంగోలు నుంచి కలెక్టర్ హాజరయ్యారు.