వైసీపీ ఆవిర్భావ దినోత్సవంలో పాల్గొన్న ఎమ్మెల్యే
ASR: జిల్లా వ్యాప్తంగా వైసీపీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా పాత బస్టాండ్ వద్ద జిల్లా పార్టీ అధ్యక్షులు మత్స్యరాస విశ్వేశ్వర రాజు వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం నాయకులతో కలిసి కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. ప్రతి పక్ష పార్టీలు ఎన్ని ఇబ్బందులు పెట్టినా జగన్ వెనకడుగు వేయలేదన్నారు.