VIDEO: వరి కొనుగోలు కేంద్రాన్ని తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్

NRML: వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలలో అన్ని సౌకర్యాలు ఉండాలని, రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ అధికారులను ఆదేశించారు. బుధవారం కుంటాల మండలం అందకూర్ గ్రామంలోని పీఎసీఎస్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న వరి కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించారు. రైతులకు ఇబ్బందులు కలగకుండా వెంటనే ధాన్యం కొనుగోలు చేయాలని ఆదేశించారు.