జిల్లాలో విషాదం.. పత్తి రైతులు ఆత్మహత్య
ASF: జిల్లాలో ఇద్దరు పత్తి రైతుల మృతితో తీవ్ర విషాదం నెలకొంది. ఇటీవల కురిసిన భారీ వర్షాలు పత్తి రైతులను కుదేలు చేశాయి. వానలకు పంట దెబ్బ తినడంతో వేంపల్లికి చెందిన మొర్ల రాము(41) పొలంలో పురుగులు మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. గంగాపూర్‌కు చెందిన ముంజం సంతోష్ (30) 10 ఎకరాల్లో పంట పండించగా పెట్టుబడి కూడా రాకపోవడంతో మనస్థాపంతో ఇంటి వద్ద పురుగుల మంది తాగి చనిపోయాడు.