VIDEO: గౌతమి తీరాన్ని మింగేస్తున్న మట్టి మాఫియా..!
కోనసీమ: కపిలేశ్వరం మండలం కేదారిలంకలో గౌతమి నది తీరంలో రాత్రివేళ అక్రమ మట్టి తవ్వకాలు విచ్చలవిడిగా సాగుతున్నాయని స్థానికులు ఆరోపిస్తున్నారు. భారీ యంత్రాలతో తవ్విన మట్టిని ఇటుక బట్టీలకు తరలిస్తున్నారని మండిపడుతున్నారు. దీనివల్ల నదితీరానికి భూక్షయం ముప్పు పొంచి ఉందని హెచ్చరిస్తున్నారు. అధికారులు స్పందించి తవ్వకాలు నిలిపివేయాలని గ్రామస్థులు డిమాండ్ చేస్తున్నారు.