పొలం వివాదంలో.. ఇరువర్గాలకు గాయాలు
KRNL: గురువారం పత్తికొండ మండలం కొత్తపల్లిలో దాయాదులైన జయరాముడు, నారాయణ కుటుంబాల మధ్య పొలంగట్టు వివాదం ఘర్షణకు దారితీసింది. ఈ దాడిలో పలువురు తీవ్రంగా గాయపడగా, మెరుగైన వైద్యం కోసం జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పోలీసులు ఇరువర్గాలపై కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.