ప్రకృతి వ్యవసాయంపై రైతులకు అవగాహన

VZM: గరివిడి మండలంలోని నీలాద్రిపురం గ్రామంలో ప్రకృతి వ్యవసాయంపై రైతులకు బుధవారం అవగాహన కల్పించారు. ప్రస్తుతం వరి పంటను ఆశించే చీడ పురుగులు నివారణ కొరకు స్థానిక ప్రకృతి వ్యవసాయ కార్యకర్త చీడి రామకృష్ణ వివరించారు. 200 లీటర్ల పలు పత్ర ద్రావణాన్ని ప్రకృతి వ్యవసాయం పద్ధతిలో రైతులతో తయారు చేసి అవగాహన కల్పించారు.