రాష్ట్రంలో అరాచక పాలన నడుస్తోంది: ఎమ్మెల్సీ
SKLM: రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అరాచక పాలన సాగిస్తోందని శ్రీకాకుళం జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ నర్తు రామారావు ఆరోపించారు. ఇచ్ఛాపురం మున్సిపల్ కార్యాలయంలో బుధవారం ఆయన మీడియా సమావేశం నిర్వహించారు. ఎన్నికల్లో బూటకపు హామీలు ఇచ్చి, ఇప్పుడు అమలు చేయకుండా నాటకాలు చేస్తున్నారని ధ్వజమెత్తారు.