VIDEO: కొండచిలువను మెడలో వేసుకుని మందుబాబు హల్‌చల్
ELR: కొండచిలువను మెడలో వేసుకుని మందుబాబు హల్‌చల్ చేశాడు. ద్వారకా తిరుమలలోని చెరువులో కొందమంది వల వేయగా చేపల బదులు కొండచిలువ చిక్కింది. దీంతో మద్యం మత్తులో ఉన్న లాజర్ అనే వ్యక్తి కొండచిలువను కర్రలతో కొట్టి చంపి, దానిని మెడలో వేసుకుని వీధుల్లో తిరుగుతూ.. ప్రజలను భయబ్రాంతులకు గురి చేశాడు.