మాజీ సర్పంచ్‌ను పరామర్శించిన ఎమ్మెల్యే

E.G: తాళ్లపూడి మండలం ప్రక్కిలంక మాజీ సర్పంచ్ నాయుడు హనుమంతరావు ఇటీవల ప్రమాదవశాత్తు గాయపడ్డాడు. విషయం తెలుసుకున్న కొవ్వూరు ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావు మంగళవారం ఆయన నివాసానికి వెళ్లి పరామర్శించారు. ప్రమాదానికి గల కారణాలు అడిగి తెలుసుకున్నారు. ఆయన త్వరగా కోలుకోవాలని ఎమ్మెల్యే అన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక కూటమి నేతలు పాల్గొన్నారు.