మద్యం సీసాలు స్వాధీనం వ్యక్తి అరెస్టు

VZM: గజపతినగరం ప్రోబిహిషన్ ఎక్సైజ్ సర్కిల్ పరిధిలో గల బొండపల్లి మండలం రాచకిండాం గ్రామంలో శనివారం సీఐ జనార్దనరావు ఆధ్వర్యంలో దాడులు నిర్వహించగా పది మద్యం సీసాలతో నంగిరెడ్ల కృష్ణ అనే వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. దాడుల్లో ఎస్.ఐ నరేంద్ర కుమార్, హెచ్. సి భాష, లోకాభిరామ్ సిబ్బంది పాల్గొన్నారు.