టీచర్‌ను అభినందించిన మంత్రి లోకేష్
KDP: కలసపాడు మండలం కర్ణంవారిపల్లె స్కూల్‌ను అందంగా అభివృద్ధి చేసిన ఉపాధ్యాయుడు గానుగపెంట రమణారెడ్డి స్ఫూర్తిదాయకమని మంత్రి లోకేష్ ట్వీట్ చేశారు. ఈ మేరకు సింగిల్ టీచర్‌గా ఉన్నప్పుడు నలుగురు విద్యార్థులే ఉన్న పాఠశాలను, ఇప్పుడు 26 మందికి పెరగడం అభినందనీయమన్నారు. పూర్వ విద్యార్థులు, తల్లిదండ్రులు, గ్రామస్థుల సహకారంతో స్కూలును గుడిలా తీర్చిదిద్దారని ఆయన ప్రశంసించారు.