సంక్రాంతి బరిలో శర్వానంద్ సినిమా
రామ్ అబ్బరాజు దర్శకత్వంలో హీరో శర్వానంద్ లేటెస్ట్ మూవీ 'నారి నారి నడుమ మురారి'. ఏకే ఎంటర్‌టైన్‌మెంట్ పతాకంపై రామబ్రహ్మం సుంకర ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. హీరోయిన్‌గా సంయుక్త మీనన్, సాక్షివైద్య నటిస్తున్నారు. ఈ సినిమాను వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల చేయబోతున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఈ సందర్భంగా కొత్త పోస్టర్‌ను విడుదల చేశారు.