ఇందిరమ్మ ఇళ్ల నాణ్యతను పరిశీలించిన ఎమ్మెల్యే
KMM: కొణిజర్ల మండలం మేకలతండాలో నిర్మాణంలో ఉన్న ఇందిరమ్మ ఇళ్లను ఎమ్మెల్యే మాలోతు రాందాస్ నాయక్ పరిశీలించారు. గృహ నిర్మాణ పనుల నాణ్యత గురించి, లబ్ధిదారుల సమస్యల గురించి తెలుసుకున్నారు. ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాల అమలుపై ప్రజలకు సూచనలు ఇచ్చారు. ఈ కార్యక్రమంలో డీసీసీ అధ్యక్షుడు దుర్గాప్రసాద్, గిడ్డంగుల ఛైర్మన్ రాయల నాగేశ్వరరావు పాల్గొన్నారు.