రైతులకు సరిపడా యూరియా అందుబాటులో ఉంచాలి: సీపీఎం

GDWL: జిల్లాలో రైతులకు సరిపడా యూరియా నిల్వలు అందుబాటులో ఉంచాలని సీపీఎం జిల్లా కార్యదర్శి వెంకటస్వామి డిమాండ్ చేశారు. గురువారం జిల్లా కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఖరీఫ్ సీజన్ ప్రారంభం కంటే ముందే యూరియాను రైతులకు అందించడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమయ్యాయని విమర్శించారు.