'విద్యార్థుల పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి'

'విద్యార్థుల పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి'

KMM: గిరిజన సంక్షేమ శాఖ ఆశ్రమ పాఠశాల విద్యార్థుల పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని ఐటీడీఏ పీవో రాహుల్ అన్నారు. గురువారం కల్లూరు గిరిజన సంక్షేమ శాఖ బాలికల ఆశ్రమ పాఠశాలను సబ్ కలెక్టర్ అజయ్ యాదవ్ తో కలిసి ఆకస్మికంగా తనిఖీ చేశారు. మెనూ ప్రకారము పిల్లలకు సమయానుకూలంగా వేడిగా ఉన్నప్పుడే ఆహారము అందించాలని హాస్టల్ వార్డెన్‌కు సూచించారు.