కడప జిల్లా ప్రజలకు గమనిక

కడప జిల్లా ప్రజలకు గమనిక

కడప జిల్లాలో వాతావరణ పరిస్థితి దృష్టిలో ఉంచుకొని జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ప్రతి సోమవారం నిర్వహించే ప్రజా సమస్యల పరిష్కార వేదిక రద్దు చేసినట్లు జిల్లా ఇన్‌ఛార్జి కలెక్టర్ ఆదితి సింగ్ ఆదివారం తెలిపారు. ఈ విషయాన్ని జిల్లా ప్రజలు గమనించాలని సూచించారు. జిల్లా ప్రజలు తమ ఫిర్యాదులు ఏమైనా ఉంటే వాటిని వెబ్‌సైట్‌లో నమోదు చేసుకోవాలని కోరారు.