జడ్పీ హైస్కూల్లో సీసీ కెమెరాలు పరిశీలన
KDP: సిద్ధవటంలోని ZP పాఠశాలలో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలను మంగళవారం ఒంటిమిట్ట సీఐ నరసింహారాజు పరిశీలించారు. ఆయన మాట్లాడుతూ.. పదవ తరగతి పబ్లిక్ పరీక్షల కోసం బి.సెంటర్లో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలను గుర్తుతెలియని వ్యక్తులు వైర్లను కట్ చేశారన్నారు. ఈ విషయమై పాఠశాలలోని వాచ్మెన్, HMలను అడిగి తెలుసుకున్నామన్నారు. 2 గదుల్లోని సీసీ కెమెరాలు దెబ్బతిన్నాయన్నారు.