బాలుడి కలలో శివుడు.. పుట్టలో శివలింగం..!
NLR: పొదలకూరు మండలం పులికల్లు గ్రామం ఎస్టీ కాలనీలో అరుదైన ఘటన చోటు చేసుకుంది. శివుడు తనకు కలలో దర్శనమిచ్చి.. పుట్టలో ఉన్న శివలింగాన్ని తీసుకురావాలని చెప్పాడని ఓ బాలుడు తెలిపాడు. అయితే ఆ బాలుడు శివుడి ఆదేశాల ప్రకారం, పుట్టలో నుంచి శివలింగాన్ని తీసుకొని వచ్చి ఇంటి ముందు ఉంచి పూజలు నిర్వహించాడు. కాగా, భక్తులు పెద్ద సంఖ్యలో అక్కడికి వచ్చి శివలింగాన్ని దర్శించుకుని పూజలు చేశారు.