గుండెపోటుతో సీపీఐ నాయకుడు మృతి

KMM: ఖమ్మం రూరల్ మండల పరిధిలోని, వెంకటాయపాలెం గ్రామానికి చెందిన సీపీఐ నాయకులు కొత్తకొండ రవీందర్ గుండెపోటుతో మృతి చెందారు. పార్టీ నాయకుల ద్వారా విషయం తెలుసుకున్న పార్టీ జిల్లా కార్యదర్శి దండి సురేష్, మహమ్మద్ మౌలానా మృతదేహాన్ని సందర్శించి అరుణ పతాకన్ని ఉంచి పూలమాలలేసి నివాళులర్పించారు. రవీందర్ మరణం పార్టీకి తీరని లోటని దండి సురేష్ అన్నారు.