పార్టీ ఆఫీస్‌లో సురవరం భౌతికకాయం

పార్టీ ఆఫీస్‌లో సురవరం భౌతికకాయం

TG: సీపీఐ సీనియర్ నేత సురవరం సుధాకర్ రెడ్డి కన్నుమూశారు. ఈ క్రమంలో నేడు అభిమానుల సందర్శనార్థం ఆయన భౌతికకాయాన్ని హిమాయత్ నగర్ పార్టీ కార్యాలయంలో ఉ.10 గంటల నుంచి మ. 3 గంటల వరకు ఉంచనున్నారు. అనంతరం గాంధీ ఆసుపత్రికి ఆయన భౌతికకాయాన్ని కుటుంబ సభ్యులు దానం చేయనున్నారు. కాగా ఇప్పటికే పలువురు రాజకీయ నేతలు, ప్రముఖులు ఆయన మృతికి సంతాపం తెలియజేశారు.