నిమ్సులో వీల్‌చైర్లను వితరణ చేసిన డా.పాటిల్
HYD: నిమ్స్ ఆసుపత్రిలోని రోగుల సౌకర్యార్థం వీల్‌చైర్ల వితరణ జరిగింది. నిమ్స్ మైక్రోబయాలజీ విభాగానికి చెందిన డా.ఎం.ఎ.పాటిల్, తమ తండ్రి లేట్ అప్పారావు పాటిల్ జ్ఞాపకార్థం ఇవాళ ఈవీల్‌చైర్లను ఆసుపత్రికి విరాళంగా అందించారు. ఇలాంటి సేవా కార్యక్రమాలు రోగులకు ఎంతో మేలు చేస్తాయని నిమ్స్ డైరెక్టర్ ప్రొ. నగరి బీరప్ప ఈ సందర్భంగా డా. పాటిల్ ప్రశంసించారు.