శ్రీ భీమలింగేశ్వరస్వామి సేవలో ఎమ్మెల్యే పెద్దిరెడ్డి

అన్నమయ్య: ద్రాక్షారామం శ్రీ భీమలింగేశ్వర స్వామివారిని తంబళ్లపల్లె ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ద్వారకనాథ రెడ్డి దర్శించుకున్నారు. స్వామివారి సన్నిధిలో ప్రత్యేక పూజలు చేశారు. అర్చకులు ఎమ్మెల్యేకు తీర్థ ప్రసాదాలు పంపిణీ చేసి ఆశీర్వదించారు. రాష్ట్ర ప్రజలు సుభిక్షంగా ఉండాలని ఆకాంక్షించారు. ఆయన వెంట మాజీ డీసీఎంఎస్ ఛైర్మన్ సామకోటి సహదేవరెడ్డి, వైసీపీ నాయకులు ఉన్నారు.