ముగిసిన ప్రచారం.. మూగబోయిన మైక్‌లు
TG: జూబ్లీహిల్స్ ఉపఎన్నిక ప్రచారం ముగిసింది. బరిలో మొత్తం 58 మంది అభ్యర్థులు ఉన్నారని హైదరాబాద్ ఎన్నికల అధికారి ఆర్వీ కర్ణన్ తెలిపారు. ఎవరైనా ప్రచారం చేస్తే కేసులు పెడతామని హెచ్చరించారు. 407 పోలింగ్ కేంద్రాలు, GHMC కేంద్ర కార్యాలయలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశామని చెప్పారు. కాగా ఈనెల 11న పోలింగ్ జరగనుండగా 14న ఫలితాలు వెలువడనున్నాయి.