మంత్రి పుట్టినరోజు సందర్భంగా రక్తదాన శిబిరం
VZM: రాష్ట్ర విద్యా, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ పుట్టినరోజు సందర్భంగా ఎస్.కోట నియోజకవర్గంలో పండగ వాతావరణం నెలకొందని ఎమ్మెల్యే కోళ్ల లలితకుమారి అన్నారు. లోకేష్ పై ఉన్న అభిమానంతో పార్టీ శ్రేణులు కొత్తవలసలోని ఓ ప్రైవేట్ కళ్యాణమండపంలో మెగా రక్తదాన శిబిరం నిర్వహించారు. అనంతరం రక్తదానం చేసిన వారికి ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్టు ద్వారా సర్టిఫికెట్లు అందజేశారు.