VIDEO: 'దంపతులు గొడవలను పక్కకు పెట్టి కలిసుండాలి'
NRML: జిల్లా కేంద్రంలోని ఎస్పీ కార్యాలయంలో బుధవారం 'వెలగనిద్దాం దాంపత్య జీవితం' కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ జానకి షర్మిల మాట్లడుతూ.. కుటుంబాలు కలిసి మెలిసి ఉన్నప్పుడే సమాజం బాగుపడుతుందని, చిన్న చిన్న గొడవలను పక్కకు పెట్టి దంపతులు కలుసుకునేలా బరోసా సెంటర్ ద్వారా కలపడం సంతోషాన్ని ఇస్తుందని తెలిపారు. కార్యక్రమంలో పోలీసు అధికారులు, పలువురు దంపతులు పాల్గొన్నారు.