గంపలపల్లి చెరువులో పడి వ్యక్తి మృతి

గంపలపల్లి చెరువులో పడి వ్యక్తి మృతి

MNCL: లక్షెట్టిపేట మున్సిపాలిటీ పరిధిలోని ఊత్కుర్‌కు చెందిన తనుగుల రాజలింగం(46) గంపలపెల్లి చెరువులో ప్రమాదవశాత్తు పడి మృతి చెందారు. రాజలింగం బుధవారం తన బర్రెలను చెరువు వైపు మేపేందుకు వెళ్ళాడు. ఎగిడి తిరుపతి బర్రెలు చెరువు నీటిలో నుండి అవతలి వైపు వెళుతుండగా వాటిని కాపాడే ప్రయత్నంలో ప్రమాదవశాత్తు రాజలింగం నీట మునిగిపోగా, గురువారం రాజలింగం మృతదేహం బయటపడింది.