'అధికారికంగా కన్యకా పరమేశ్వరి జయంతి వేడుకలు'
ADB: వాసవీ కన్యకా పరమేశ్వరి జన్మోత్సవాలను ప్రభుత్వం అధికారికంగా జరిపేందుకు నిర్ణయిస్తూ జీవో జారీ చేయడం ఆనందంగా ఉందని ఆదిలాబాద్ అసెంబ్లీ నియోజక వర్గ ఇంఛార్జ్ శ్రీనివాస రెడ్డి అన్నారు. గురువారం పట్టణంలో నిర్వహించిన జయంతి వేడుకల్లో పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. ప్రభుత్వ నిర్ణయం ఆర్యవైశ్యుల గౌరవాన్ని పెంచే విధంగా ఉందని అన్నారు.