'ఆ స్వాగతం మరువలేనిది'.. ఇథియోపియా పర్యటనపై మోదీ
తన ఇథియోపియా పర్యటనపై ప్రధాని మోదీ SM వేదికగా స్పందించారు. 'థాంక్యూ ఇథియోపియా.. మీరిచ్చిన వెల్కమ్ ఎప్పటికీ మర్చిపోలేను' అని ప్రధాని మోదీ ట్వీట్ చేశారు. అక్కడి భారతీయుల ఆప్యాయత అద్భుతమని కొనియాడారు. రాబోయే రోజుల్లో భారత్-ఇథియోపియా బంధం మరింత బలపడుతుందని ధీమా వ్యక్తం చేశారు. ఈ మేరకు తన పర్యటన హైలైట్స్, అక్కడి జ్ఞాపకాలతో కూడిన ఓ స్పెషల్ వీడియోను మోదీ షేర్ చేశారు.