బాపట్ల పట్టణంలో ఘనంగా మేడే ర్యాలీ

BTP: ప్రపంచ కార్మికుల దినోత్సవాన్ని పురస్కరించుకుని బాపట్ల పట్టణం పాత బస్టాండ్ వద్ద ఆటో యూనియన్ కార్మికులు భారీ ర్యాలీ నిర్వహించారు. చేతుల్లో తప్పెట్లు, ఎర్రజెండాలతో నినాదాలు చేస్తూ ఊరేగిన వారు, తమ జీవన పరిస్థితులపై ప్రభుత్వ దృష్టి పెట్టాలని కోరారు. కార్మికుల కోసం అమలు చేయాల్సిన సంక్షేమ పథకాలు సమర్థవంతంగా అమలు కావాలని డిమాండ్ చేశారు.