త్రాగునీటి కోసం ఖాళీ బిందెలతో మహిళల నిరసన

త్రాగునీటి కోసం ఖాళీ బిందెలతో మహిళల నిరసన

KDP: సిద్ధవటం మండలంలోని ఉప్పరపల్లి గ్రామంలో గత రెండు నెలలుగా త్రాగునీరు అందక తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నామని గురువారం ఉప్పరపల్లె గ్రామ మహిళలు ఖాళీ బిందెలతో నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. పలుమార్లు పంచాయతీ అధికారులకు నీటి సమస్యను పరిష్కరించాలని విన్నవించినా పరిష్కారం కాలేదన్నారు. సంబంధిత అధికారులు నీటి సమస్యను పరిష్కరించాలన్నారు.